పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. మహిళల వన్డే ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యురాలైన వికెట్‌కీపర్ రిచా ఘోష్ పేరుతో ఒక క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈ స్టేడియాన్ని డార్జిలింగ్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. కాగా, ఇప్పటికే బెంగాల్ ప్రభుత్వం రిచా ఘోష్‌కు DSP పోస్ట్‌ను కూడా అందించింది.