కృష్ణా: గన్నవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావుతో కలిసి కలెక్టర్ డీకే బాలాజీ సోమవారం సందర్శించారు. ఆసుపత్రిలో వైద్య సేవలు, సిబ్బంది అందుబాటు, రోగుల సౌకర్యాలు, శుభ్రత వంటి అంశాలను కలెక్టర్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.