PDPL: కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లికి చెందిన సూరం గంగరాజు బావిలో పడి మృతి చెందాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన గంగరాజు ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం గ్రామ శివారులోని బావిలో గంగరాజు మృతదేహం కనిపించింది. దీంతో తారుపల్లిలో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.