WGL: వరంగల్ మిల్స్ కాలనీ పోలీసులు, గొడవలు నివారించేందుకు బిర్యాని హోటల్స్, పాన్ షాపుల యాజమానులను మంగళవారం తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు సీఐ బొల్లం రమేష్ తెలిపారు. గతంలో గొడవలకు కారణమైన షాపుల యాజమానులను పోలీసులు కౌన్సిలింగ్ చేసి వారిని హెచ్చరించారు. అర్ధరాత్రి గొడవలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ వారిని హెచ్చరించారు.