కడప ఎస్పీ ఆదేశాల మేరకు, ట్రాఫిక్ సీఐ DK జావీద్ కడప ఎస్పీ బంగ్లా సర్కిల్ వద్ద రోడ్డు భద్రత సైన్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు CI మాట్లాడుతూ.. వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలని, మైనర్ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరమన్నారు. అనంతరం ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలన్నారు.