SRD: 15 ఏళ్ల వయస్సులో సొంతూరు, సొంతవాళ్లను, వదిలి వెళ్లిన వ్యక్తి 50 ఏళ్ల తర్వాత తిరిగి తన ఆప్తులను వెతుక్కుంటూ సొంతూరికి వచ్చాడు. ఝరాసంగం మండలం బొప్పనపల్లికి చెందిన సంగన్న తన 15వ ఏటా జీవోనాపాధి కొరకు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాడు. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలో పని చేసుకుంటూ ఇన్నాళ్లు జీవనాన్ని కొనసాగించాడు. హఠాత్తుగా ఇవాళ తన సొంతూరికి రాగా గ్రామస్తులు సన్మానించారు.