AI దుర్వినియోగం అవుతున్న తీరుపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీ.ఆర్.గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘మా డీప్‌ఫేక్ ఫోటోలను కూడా చూశాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. న్యాయమూర్తులు, న్యాయవాదుల ఫోటోలను కూడా మార్ఫింగ్ చేస్తున్నారని సీజేఐ పేర్కొన్నారు. AI దుర్వినియోగం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆయన న్యాయవాదులకు సూచించారు.