కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి 179 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మనిర్ణీత గడువులోపు అన్ని ఫిర్యాదులను పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు.