ELR: కామవరపుకోటలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం దాడులు జరిపారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ మాట్లాడుతూ.. అక్రమంగా మద్యం అమ్ముతున్న గ్రామానికి చెందిన ఓ మహిళ వద్ద 5 మద్యం సీసాలను గుర్తించామన్నారు. మహిళను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామన్నారు. అలాగే మండల పరిధిలోని మద్యం దుకాణాలు తనిఖీ చేశామన్నారు.