AP: తిరుపతి జిల్లాలోని రాయలచెరువు కట్ట తెగి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేసింది. బాధితులను ఆదుకునేందుకు రూ.3.23 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించింది. 960 బాధిత కుటుంబాలకు రూ.3 వేల చొప్పున అందించాలని ఆదేశాలు జారీ చేసింది.