BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని సుల్తాన్పూర్-కోనరావుపేట, వెంకటేశ్వర్లపల్లి-కొత్తపల్లి గ్రామాల ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిని అధ్వానంగా మారాయి. దీంతో ఆ గ్రామాల ప్రజలు రాత్రి సమయంలో మార్గం గుండా వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక MLA, జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి మరమ్మతులు చేపట్టాలని ఇవాళ స్థానికులు డిమాండ్ చేశారు.