టీమిండియా, దక్షిణాఫ్రికా మధ్య ఈనెల 14న ఈడెన్ గార్డెన్స్ వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పంత్, ధ్రువ్ జురెల్ ఇద్దరూ వికెట్ కీపర్ కోసం పోటీ పడుతున్నారు. అయితే, వీరిద్దరూ తుది జట్టులో ఉంటే బాగుంటుందని మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. సాయి సుదర్శన్ లేదా నితీష్ కుమార్ రెడ్డిని తప్పించక తప్పదని చెప్పాడు.