TG: HYDలోని లాలాపేట్ జయశంకర్ స్టేడియంకి అందెశ్రీ భౌతికకాయాన్ని తరలించారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయన పార్థివదేహానికి నివాళులు అర్పించారు. మాజీ మంత్రులు KTR, హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, BRS నేత పద్మారావు గౌడ్ నివాళులర్పించారు. అలాగే MP ఈటల రాజేందర్ కూడా హాజరై నివాళులర్పించారు. కాగా, మరికాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అందెశ్రీ భౌతికకాయాన్ని సందర్శించనున్నారు.