రష్యాలోని రెండు ప్రధాన నగరాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి చేసింది. ఈ ఘటనలో ఆయా నగరాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా 20 వేల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అయితే తమ భూభాగంలోకి వచ్చిన పలు డ్రోన్లను కూల్చేసినట్లు అధికారులు తెలిపారు. దాడి వల్ల స్థానిక యుటిలిటీ ప్రాంతంలో మంటలు చెలరేగాయని, వెంటనే ఆర్పేశామని చెప్పారు.