AKP: కోటవురట్ల మండలం రాజుపేటలో రాజరాజేశ్వరి సమేత రాజలింగేశ్వర స్వామి ఆలయంలో 3వ కార్తీక సోమవారం పూజలను భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు దీపారాధన చేసి స్వామిని దర్శించుకుని అర్చనలు నిర్వహిస్తున్నారు. గ్రామ సర్పంచ్ బొడ్డేడ వెంకటరమణ మాట్లాడుతూ.. ఈనెల 21వ తేదీ వరకు కార్తీక మాసం పూజలు జరుగుతాయని అన్నారు.