SKLM: ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలవబడుతున్న జలుమూరు మండలం శ్రీముఖలింగంలో కార్తీక మూడవ సోమవారం శివనామస్మరణతో మారుమోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తన స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్థానిక ఎస్సై అశోక్ బాబు ఆధ్వర్యంలో భద్రతను ఏర్పాటు చేశారు.