GDWL: న్యాయవాదుల భద్రత కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. న్యాయ వృత్తి గౌరవాన్ని కాపాడేందుకు రక్షణ చట్టం అత్యవసరమని ఆయన పేర్కొన్నాడు. అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 9న జోగులాంబ దేవాలయం నుండి హైదరాబాద్ వరకు ప్రారంభమైన మహా పాదయాత్రకు ఆయన సోమవారం మద్దతు తెలిపాడు.