అన్నమయ్య: సంబెపల్లి మండలంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన గొడవల కారణంగా శివమ్మ (23) అనే యువతి సోమవారం ఉదయం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను 108 అంబులెన్స్ ద్వారా రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు ఆమెకు తక్షణ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.