ప్రకాశం: మార్కాపురాన్ని జిల్లా ఏర్పాటు చేస్తే శ్రీశైలాన్ని మార్కాపురంలో కలపాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ ఇంఛార్జి అన్నా రాంబాబు డిమాండ్ చేశారు. గతంలో మార్కాపురం రెవెన్యూ డివిజన్ కర్నూలు జిల్లా నుండి ఇక్కడికి వచ్చిందని, కానీ శ్రీశైలాన్ని మాత్రం ఆ జిల్లాలోనే ఉంచుకున్నారని ఆయన తెలిపారు. జిల్లా ఇస్తే శ్రీశైలాన్ని కచ్చితంగా మార్కాపురంలో కలపాలన్నారు.