దక్షిణాఫ్రికా, టీమిండియా మధ్య ఈనెల 14 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. అయితే, రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 16 సిరీస్లు జరిగాయి. ఇందులో సౌతాఫ్రికా 8 సార్లు విజయం సాధించింది. కేవలం నాలుగు సార్లు భారత్ విజయం సాధించింది. మరో నాలుగు సిరీస్లు డ్రా అయ్యాయి. దీంతో టీమిండియాకు దక్షిణాఫ్రికా గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.