SRD: కందిలోని ప్రాథమిక సహకార కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని టీజీజిఐసీ ఛైర్ పర్సన్ నిర్మల రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాలో నగదు జమ చేయాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్ పాల్గొన్నారు.