TG: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై సుప్రీంకోర్టులో BRS కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీం ఆదేశాలు ఉన్నా చర్యలు తీసుకోలేదని కోర్టును ఆశ్రయించింది. అయితే ఈ కేసు విచారణకు మరింత గడువు కావాలని ఇప్పటికే సుప్రీంలో స్పీకర్ కార్యాలయం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.