E.G: రాజమండ్రి నగరంలో జరిగిన “Unity March – Ek Bharat, Aatmanirbhar Bharat” ర్యాలీలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొని జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలను స్మరించుకుంటూ.. దేశ ఐక్యత, సమగ్రత, దేశభక్తి భావాలను బలపరచాలనే నినాదంతో యువత, బీజేపీ నాయకులు, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు.