MDK: పత్తి పంటను మద్దతు ధరకే విక్రయించుకునేందుకు రైతులు ‘కపాస్ కిసాన్ యాప్’ను తప్పక ఉపయోగించాలని మండల వ్యవసాయ అధికారి రాజేష్ కుమార్ తెలిపారు. మాదాపూర్లో రైతులకు ఆయన అవగాహన కల్పించారు. రైతులు యాప్లో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతే కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్మాలని సూచించారు. దళారుల బారి నుంచి తప్పించుకోవడానికి ఈ యాప్ కీలకమని తెలిపారు.