AKP: నర్సీపట్నంలో ప్రైవేట్ ఆస్పత్రిలో స్కానింగ్ సెంటర్లను జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీర జ్యోతి సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్కానింగ్ సెంటర్లలో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని ఆసుపత్రి యాజమాన్యాలకు సూచించారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తెలిస్తే తగు చర్యలు ఉంటాయని హెచ్చరించారు.