SRCL: ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించారు. ఇంటి నిర్మాణం, ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆరా తీశారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.