SKLM: శక్తి యాప్ వినియోగించడం వలన మహిళలకు సురక్షిత జీవనం సాగించేందుకు దోహదపడుతుందని శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తెలియజేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మహిళలకు విద్యార్థులకు శక్తి యాప్‌పై అవగాహన కలిగించారు. పలువురితో మాట్లాడి వారి వద్ద ఉన్న మొబైల్లో యాప్ రిజిస్టర్ చేయించి అత్యవసర సమయాల్లో వినియోగించాలన్నారు.