SRCL: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత ధాన్యం వచ్చింది? ఎంత కొనుగోలు చేశారో ఆరా తీశారు. అధికారులు రైతులు పాల్గొన్నారు.