AP: సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశం సీఎం చంద్రబాబు మంత్రులను అభినందించారు. మొంథా తుఫాన్ సమయంలో ప్రతిఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి.. ప్రజలకు తక్షణ సాయం అందేలా బాగా పనిచేశారని అన్నారు. అధికారుల సమన్వయంతోనే సహాయచర్యలు వేగంగా అందాయన్నారు. RTGS నుంచి నిరంతర పర్యవేక్షణతో ప్రాణ, ఆస్తినష్టం తగ్గించామని తెలిపారు.