NZB: భీంగల్ నుంచి కమ్మర్ పల్లి వైపు సోమవారం అక్రమ ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో రెవెన్యూ సిబ్బంది హసకొత్తూరు గ్రామం వద్ద ట్రాక్టర్లను గుర్తించారు. వారిని పట్టుకునే ప్రయత్నంలో అధికారులు వెంబడించగా, డ్రైవర్ తప్పించుకునేందుకు ట్రాక్టర్ను అతివేగంగా నడిపాడు. దీంతో కమ్మర్ పల్లి గ్రామ చివరలోని క్రాసింగ్ వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.