W.G: ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎమ్మెల్యే RRR చొరవతో, దాతల సహకారంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆకివీడు సీఐ వి. జగదీశ్వరరావు ఈ కెమెరాలకు సంబంధించిన పనులకు సోమవారం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కెమెరాలు త్వరలోనే వినియోగంలోకి వస్తాయని ఆయన తెలిపారు.