PDPL: ఓదెల మండలం కొలనూరు గ్రామంలో దురదృష్టకర ఘటన జరిగింది. ఆదివారం తన పాత భవనం ముందు కూర్చున్న వృద్ధురాలు అంతగిరి లక్ష్మి (65)పై సజ్జలపై ఉన్న రేకులు ఒక్కసారిగా కూలిపడ్డాయి. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. నీడ కోసం వేసుకున్న రేకులే ప్రాణాంతకమయ్యాయి. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.