GNTR: పెదకాకాని ఎంపీపీపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. మండలంలో మొత్తం 21 ఎంపీటీసీలు ఉండగా, 14 మంది సభ్యులు సోమవారం సమావేశానికి హాజరయ్యారు. అవసరమైన కోరం ఉండటంతో ఆర్డీవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, సీఐ నారాయణస్వామి నేతృత్వంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.