NRML: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శాశ్వత డాగ్ కెన్నెల్ ఏర్పాటుకు ఎస్పీ జి. జానకి షర్మిల సోమవారం భూమి పూజ నిర్వహించారు.జి ల్లాలో ఇప్పటి వరకు శాశ్వత డాగ్ కెన్నెల్ లేకపోవడంతో పోలీసు శ్వాన దళానికి తగిన సదుపాయాలు లభించలేదు. ఇకపై దళానికి శిక్షణ, సంరక్షణకు అవసరమైన అన్ని వసతులు ఈ కొత్త కెన్నెల్లో కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు.