టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ సోమవారం కనిపించలేదు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్.. రవీంద్ర జడేజాను వదులుకునేందుకు సిద్ధమైందని వస్తున్న వార్తలకు బలం చేకూరినట్లైంది. అయితే, ఏ కారణం వల్ల అతడి అకౌంట్ కనిపించకుండా పోయిందో తెలియలేదు. కాగా, సంజూను తీసుకునేందుకు CSK.. జడేజాను వదులుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.