AKP : నర్సీపట్నంలో ఈ నెల 12 తేదీన వైసీపీ ప్రజా ఉద్యమం అనే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఉద్యమం పేరిట మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడం వ్యతిరేకిస్తామన్నారు.