SRD: బిస్లరీ పరిశ్రమలో తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పరిశ్రమకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ ప్రావిణ్యకు వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, ఉపాధ్యక్షుడు మాణిక్యం పాల్గొన్నారు.