KMR: మద్నూర్ మండలంలో ఉపాధి హామీ జాబ్ కార్డులకు ఆధార్ ఈ-కేవైసీ ప్రక్రియను గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు ముమ్మరం చేశారు. మండలంలో మొత్తం 12,510 జాబ్ కార్డులకు గాను, ఇప్పటి వరకు 10,186 కార్డులకు (81.43 శాతం) ఈ-కేవైసీ పూర్తయినట్లు ఉపాధి హామీ అధికారులు తెలిపారు. ఈ-కేవైసీ చేయించుకోని లబ్ధిదారులు వెంటనే గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ల వద్ద తప్పకుండా పూర్తి చేయవలన్నారు.