TG: మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని డివిజన్ ఇంఛార్జ్‌లతో మంత్రులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు మంత్రులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.