RR: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కాకునూరు గ్రామానికి వెళ్లే రహదారిలో చంద్రకళ గార్డెన్ వద్ద సైకిల్‌ను బైక్ ఢీ కొట్టింది. దీంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.