NZB: జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రచించిన ప్రముఖ కవి ‘అందెశ్రీ’కి NZB జిల్లాతో అనుబంధం ఉంది. అందె ఎల్లయ్య (అందెశ్రీ) కొన్ని సంవత్సరాల క్రితం జిల్లాలోని మాక్లూర్ మండలంలో భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. ఆ సమయంలో అమ్రాద్లో శంకర్ మహరాజ్ వద్ద శిష్యరికం చేశారు. ఆ సమయంలోనే సమాజాన్ని అర్థం చేసుకునే తత్వం అలవాటైందన్నారు.