VZM: విధి నిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు మంగళవారం ఆర్థిక సహాయాన్ని SP ఏ.ఆర్ దామోదర్ అందజేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన SI శ్రీనివాసరావు కుటుంబానికి రూ.1.48లక్షలు, అనారోగ్యంతో మరణించిన కానిస్టేబుల్ నాగభూషణరావు కుటుంబానికి ఉద్యోగుల ఫండ్‌లోని రూ.1,18లక్షలతో పాటు ఫ్యూనరల్స్ కోసం రూ.30,000 చెక్ అందజేశారు.