AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. దాదాపు 70 అజెండా అంశాలతో కేబినెట్ సుదీర్ఘంగా సాగనుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈ సమావేశంలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా అమరావతిలో సంస్థలకు భూముల కేటాయింపుపై చర్చించనున్నారు.