సత్యసాయి: పుట్టపర్తిలో ఈనెల 18 నుంచి ప్రారంభంకానున్న సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు 25 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, భోజన సౌకర్యాలు సహా అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు ట్రస్ట్ సభ్యులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు.