KMR: జిల్లాలో యాసంగి పంటల సాగుపై రైతులు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడటంతో ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లో నీరు సమృద్ధిగా చేరింది. శనగ, వరి మొక్కజొన్న పంటలు ఎక్కువ మొత్తంలో సాగయ్యే అవకాశం ఉంది. నిజాంసాగర్, పోచారం, కౌలాస్ నాలా ప్రాజెక్టుల ద్వారా విడతల వారీగా నీటిని అందించనున్నారు. జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యే అవకాశం ఉంది.