KDP: జిల్లా వ్యాప్తంగా అన్ని ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి సమ్మెటివ్ ఆసెస్ మెంట్ 1 పరీక్షలు జరగనున్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మంగళవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తెలిపారు.