ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కమిషనర్ అహ్మద్ పట్టణంలో పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరిచేందుకు సోమవారం వేకువ జామున పలు ప్రాంతాలలో ఆకస్మిక పారిశుద్ధ్య తనిఖీ నిర్వహించారు. మెయిన్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్ వంటి కీలక ప్రాంతాలలో స్వయంగా పర్యటించారు. పారిశుద్ధ్య సిబ్బంది పనితీరును మరియు రోడ్ల శుభ్రతను నిశితంగా పరిశీలించారు.