KNR: ఉల్లంపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో శ్యామకూర అంజవ్వకు చెందిన 10 క్వింటాళ్ల వరిధాన్యాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. వడ్లు ఆరబెట్టుకోవడానికి కొనుగోలు కేంద్రానికి వస్తే పండించిన పంటకు రక్షణ లేకుండా పోయిందని ఆమె వాపోయారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను దొంగలు ఎత్తుకెళ్లడంతో అంజవ్వ కన్నీటి పర్యంతమయ్యారు.