NZB: ప్రముఖ కవి అందెశ్రీ అకాల మరణం పట్ల తెలంగాణ జాగృతి చీఫ్ కవిత సోమవారం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనింపజేసిన అద్భుత గీతం అందెశ్రీ కలం నుంచే వచ్చిందని కొనియాడారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలోనూ, సాంస్కృతిక పునరుజ్జీవన పోరాటంలోనూ ఆయన పోషించిన పాత్ర సదా స్మరణీయం అన్నారు.