టీమిండియా విధ్వంసకర ప్లేయర్ అభిషేక్ శర్మపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బ్యాట్ల విషయంలో అతడికున్న సెంటిమెంట్ గురించి వెల్లడించాడు. ‘అభిషేక్ నుంచి ఏమైనా తీసుకోవచ్చు. కానీ అతడి బ్యాట్ మాత్రం ఎవరూ తీసుకోలేరు. దీనికోసం అభిషేక్ పెద్ద యుద్ధమే చేస్తాడు. అవసరమైతే ఏడుస్తాడు కూడా. అతడి దగ్గర పది బ్యాట్లు ఉన్నా.. ఒక్క బ్యాట్ కూడా ఎవరికీ ఇవ్వడు’ అని చెప్పుకొచ్చాడు.